డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంకు ఖాతా వరకు.. అన్నింటికీ ఇక ఒకటే కార్డు: అమిత్ షా

24-09-2019 Tue 07:51 | National
  • ఒకే దేశం-ఒకే కార్డు దిశగా కేంద్రం
  • తొలిసారి పేపర్ ఉపయోగించకుండా జన గణన
  • మొబైల్ యాప్ ద్వారా కుటుంబ వివరాల నమోదు
ప్రస్తుతం దేశంలోని పౌరుల జేబులు కార్డులతో నిండిపోతున్నాయి. పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని కార్డులు. అయితే, ఇకపై ఇన్నిన్ని కార్డులు జేబులో వేసుకుని తిరిగే బాధ తప్పనుంది. ‘ఒకే దేశం-ఒకే కార్డు’ పేరుతో అన్నింటి వివరాలు ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు ఇలా అన్నింటినీ వేర్వేరుగా వెంట తీసుకెళ్లే పనిలేకుండా వాటి స్థానంలో ‘ఆల్ ఇన్ వన్’ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

భారత రిజిస్ట్రార్ జనరల్/జనగణన కమిషన్ కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన అనంతరం షా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ దిశగా చర్యలు ప్రారంభమైనదీ, లేనిదీ వెల్లడించలేదు. బహుళ ప్రయోజనకార్డు వలన చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈసారి జనాభా లెక్కలను మొబైల్ యాప్‌తో నిర్వహిస్తున్నట్టు చెప్పిన షా.. తొలిసారి కలం, కాగితం అవసరం లేకుండా జనాభాను లెక్కిస్తున్నట్టు తెలిపారు. కొత్త మొబైల్ యాప్‌లో ఎవరైనా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.
Amit ShahaadharIndiacards

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more